Singer Suchitra: తన మాజీ భర్త గే అన్న సుచిత్ర ! సుచిత్ర వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మాజీ భర్త !

తన మాజీ భర్త గే అన్న సుచిత్ర ! సుచిత్ర వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మాజీ భర్త !

Hello Telugu - Singer Suchitra

Singer Suchitra: నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ కార్తీక్‌ కుమార్‌… గే అంటూ అతడి మాజీ భార్య, సింగర్‌ సుచిత్ర(Singer Suchitra) తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లయిన 11 ఏళ్లకు అతడి నిజ స్వరూపం తెలిసిందని… అప్పటిదాకా తను గే అని బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొంది. అమృత అతడిని పెళ్లి చేసుకుని తప్పు చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై నటుడు కార్తీక్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు.

Singer Suchitra….

‘నేను స్వలింగసంపర్కుడినా? ఒకవేళ అదే అయ్యుంటే మాత్రం బయటకు చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు. అది ఏదైనా సరే గర్వంగా చెప్పుకునేవాడిని. అంతేకానీ ముడుచుకుపోను. నా నగరంలో దర్జాగా ర్యాలీ చేసేవాడిని… అన్నిరకాల వాళ్లు అందులో పాల్గొని వారు అండగా నిలబడేవాళ్లు. ఎవరూ దేనికీ తలదించుకోవాల్సిన అవసరం లేదు. గర్వంగా బతకండి’ అంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు.

సుచిత్ర, కార్తీక్ కుమార్ పరస్పర ఆరోపణలు చూసిన నెటిజన్లు… కార్తీక్ కుమార్ ఎంతో శాంతంగా బదులివ్వడాన్ని మెచ్చుకుంటున్నారు. ఏళ్ల తరబడి మీరు కొట్టుకుంటూనే ఉన్నారు… మీ గొడవలకు అంతనేదే లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మీరు మీ మాజీ భార్య గురించి ఎంతో మంచి మాటలు చెప్తే ఆమె మాత్రం ఇలా లేనిపోని మాటలనేసి అవమానిస్తుంటే చూడటానికి మాకే బాధగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన బిజినెస్ మెన్ సినిమాలో సారొస్తారా… రొస్తారా… వస్తారొస్తారా… రొస్తారా అనే పాటతో పాపులారిటీ సంపాదించుకుంది సింగర్ సునీత. తెర వెనుక గాయనిగానే కాకుండా సినిమా ఫంక్షన్ లో స్టేజ్ పై హావభావాలతో పాటను పాడుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా… కొన్నేళ్ల క్రితం ఈమె… సుచీ లీక్స్ పేరుతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయటపెట్టి వివాదం సృష్టించింది. ధనుష్, రానా దగ్గుబాటి, త్రిష, ఆండ్రియా, అనిరుధ్ వంటి సెలబ్రిటీల పార్టీ ఫోటోలు లీక్ కావడంతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది. ఇది చాలా వివాదానికి కారణమైంది. ఇలాంటివి జరిగి చాలా రోజులైంది. తాజాగా మరోసారి స్టార్ హీరో ధనుష్ తో పాటు తన మాజీ భర్త కార్తీక్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Also Read : Sharathulu Varthisthai: ఓటీటీలోకి ‘షరతులు వర్తిస్తాయి ’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com