Singer KS Chitra: ప్రముఖ నేపథ్య గాయని చిత్రపై ఓ వర్గానికి చెందిన నెటిజన్లు సైబర్ దాడికి తెగబడ్డారు. ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న రామమంది ప్రాణప్రతిష్ఠ వేడుకను ఉద్దేశ్యించి నేపథ్య గాయని చిత్ర విడుదల చేసిన వీడియో సందేశంపై… ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఆమె విడుదల చేసిన వీడియో సందేశానికి కేరళలోని అధికార సీపీఎం సహా, కాంగ్రెస్, బిజేపీ పార్టీల నాయకులు సింగర్ చిత్రకు మద్దత్తుగా నిలువగా… ఓ వర్గం ఆమెపై తీవ్రమైన సైబర్ దాడికి దిగడం… సెలబ్రెటీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తన మనోభావాలను తెలిపే హక్కు చిత్రకు ఉందంటూ దేశంలో మెజారిటీ వర్గాలు ఆమెకు మద్దత్తు తెలుపుతున్నప్పటికీ… ఓ వర్గం ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ తీవ్ర విమర్శల దాడికి దిగడం సంచలనంగా మారింది.
Singer KS Chitra – చిత్ర విడుదల చేసిన వీడియో సందేశం ఏమిటంటే ?
ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ ఉద్దేశ్యించి గాయని చిత్ర ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ‘‘ఆయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ రోజున శ్రీరాముడి కీర్తనలు ఆలపించండి. సాయంత్రం వేళ ఇళ్లలో ప్రమిదలతో 5 దీపాలు వెలిగించండి’’ అని ప్రజలను కోరుతూ… ‘లోకా సమస్తా సుఖినోభవంతు’ అంటూ రెండు రోజుల క్రితం వీడియో సందేశాన్ని విడుదల చేసారు. ఇది నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది ఆమెకు మద్దత్తు తెలపగా…. ఓ వర్గం ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ తీవ్ర విమర్శల దాడికి దిగింది.
భారతీయ సినీ పరిశ్రమలో చిత్రగా పేరుపొందిన ప్రముఖ నేపథ్య గాయని పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర(Singer KS Chitra) (కె.ఎస్.చిత్ర). “దక్షిణ భారత నైటింగేల్” బిరుదు అందుకున్న ఈమె… మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ మొదలైన భాషల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడింది. చిత్రను భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ పురస్కారం, 2021 లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
Also Read : Rajinikanth : తలైవా పై మండిపడ్డ వృద్ధురాలు.. వైరల్ అవుతున్న వీడియో