Arjit Singh: కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. సినీ రంగానికి సంబంధించి టాప్ సింగర్ గా కొనసాగుతున్న అర్జిత్ సింగ్(Arjit Singh) కు పద్మ పురస్కారం వరించింది. తన స్వస్థలం పశ్చిమ బెంగాల్. ఏప్రిల్ 25, 1987లో పుట్టాడు. తన వయసు 37 ఏళ్లు. గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. తనతో పాటు డైరెక్టర్ శేఖర్ కపూర్, నటులు బాలకృష్ణ, అజిత్ కుమార్, శోభన, అనంత నాగ్ లకు కూడా పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.
Arjit Singh got Padma Bhushan Award
తన స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని జియా గంజ్. 2007 నుంచి పాపులర్ అయ్యాడు సింగర్ గా. ఎన్నో సంగీత కచేరిలు నిర్వహించాడు. జీవిత భాగస్వామి కోయల్ రాయ్. 2014లో పెళ్లి చేసుకున్నాడు. 2005లో ఫేమ్ గురుకుల్ రియాల్టీ షోలో పాల్గొని సింగర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సినీ రంగానికి చెందిన పలు విజయవంతమైన సినిమాలలో పాటలు పాడాడు.
జాతీయ చలన చిత్ర అవార్డుతో పాటు ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందాడు. జియాగంజ్ లో కక్కర్ సింగ్, అదితి సింగ్ లకు పుట్టాడు. తండ్రి పంజాబీ సిక్కు, తల్లి బెంగాలీ హిందూ. అర్జిత్ సింగ్ పాడిన పాటలు అత్యంత జనాదరణ పొందాయి. తను హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా పాటలు పాడాడు.
Also Read : దర్శకుల్లో అగ్రగణ్యుడు శేఖర్ కపూర్