Simbu: కోలీవుడ్ లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న హీరో శింబుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల శింబు నటించిన ‘పత్తుతల’ చిత్రం పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే శింబుకు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న సినిమాలో శింబు కథానాయకుడిగా నటించనున్నారు. దేశింగు పెరియ సామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నా యి. ఈ చిత్రం కోసం శింబు ప్రత్యేకంగా కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యల్లోనూ శిక్షణ పొందుతున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
Simbu Movie Updates
అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే మరో రెండు సినిమాలకు శింబు(Simbu) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. శింబు తన 49వ చి త్రాన్ని అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ డబుల్ ఓకే అనిపించడంతో వెంటనే అందులో నటించడాని కి సమ్మతించినట్లు తెలిసింది. ఇకపోతే శింబు తన 50వ సినిమాను మాత్రం గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో తన 50వ సినిమాను సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూరారై పోట్రు (తెలుగులో ఆకాశమే హద్దురా) వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర తాజాగా మరోసారి సూర్యతో పురనానూరు అనే చి త్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత శింబుతో చేసే చిత్రం ఉండే అ వకాశం ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read : Thug Life: మణిరత్నం క్రేజీ ప్రాజెక్టులో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోలు !