Sikandar : పాన్ ఇండియా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న చిత్రం సికిందర్. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న తో పాటు లవ్లీ బ్యూటీ కాజోల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Sikandar Movie Updates
ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సికిందర్(Sikandar) మూవీలోని ఫస్ట్ సాంగ్ జోహ్రా జబీన్ పాటను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అద్భుతమైన డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో అదరగొట్టారు సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా. మరోసారి తనదైన మార్క్ చూపించాడు ఏఆర్ మురుగదాస్. పిక్చరైజేషన్ మమరింత రిచ్ గా ఉంది. చూసేందుకు ఆకట్టుకునేలా ఉంది. దీంతో సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేశాడు డైరెక్టర్.
ఆకర్షణీయమైన సంగీతం అలరించేలా ఉంది. దీనిని ప్రీతమ్ స్వర పరిచారు. సాహిత్యాన్ని సమీర్, డానిష్ సబ్రి రాశారు. నకాష్ అజీజ్, దేవ్ నేగి ఈ ట్రాక్ కు తమ గాత్రాలను అందించారు. ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేశారు.
ఈద్ పండుగ ముందే వచ్చేసింది. ఎందుకంటే సల్మాన్ భాయ్ , రష్మిక కలిసి సందడి చేసేందుకు మీ ముందుకు వస్తున్నారంటూ పేర్కొన్నారు దర్శకుడు. మొత్తంగా సికిందర్ పై ఫుల్ హోప్ తో ఉన్నాడు బాలీవుడ్ నటుడు.
Also Read : Hero Nithin-Robinhood :నితిన్ రాబిన్ హుడ్ మూవీలో వార్నర్