Sikandar : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటిస్తున్న చిత్రం సికిందర్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత తమిళ సినీ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ హిందీలో సూపర్ స్టార్ తో సినిమా చేయడం. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సికిందర్ కు సంబంధించి కొత్త పాట టీజర్ ను విడుదల చేశారు.
Sikandar Teaser Updates
ఇందులో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా పోటీ పడి నటించారు. డ్యాన్సులతో హోరెత్తించారు. మరింత అందంగా కనిపించడం విశేషం. కాగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఎలాగైనా సరే ఇప్పటికే ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తామన్నారు. దీంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది. మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా సికిందర్(Sikandar) ప్రేక్షకుల ముందుకు రానుంది.
పూర్తిగా సికిందర్ ను యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దాడు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. తాజాగా కొత్త సాంగ్ నాచే కోసం టీజర్ ను ఇన్ స్టాగ్రామ్ లో మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ మార్చి 18న మంగళవారం విడుదల చేస్తామని ప్రకటించారు. విలాసవంతమైన విజువల్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. సికిందర్ నాచేలో అమిత్ మిశ్రా, ఆకాసా , సిద్దాంత్ మిశ్రా పాడారు. సాహిత్యాన్ని సమీర్ రాశారు.
సికిందర్ సినిమాను 90 రోజుల పాటు ముంబై, హైదరాబాద్ , భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో చిత్రీకరించారు. ఈ చిత్రంపై భారీ నమ్మకంతో ఉన్నారు దర్శకుడు, హీరో. ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది వేచి చూడాలి.
Also Read : రంజాన్ కోసం ఉపవాసం క్యాన్సర్ అబద్దం