దుబాయ్ – మంచి చిత్రాలకు పెట్టింది పేరు సి.అశ్వనీదత్ నేతృత్వంలోని వైజయంతీ మూవీస్. కమర్షియల్ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న ఈ తరుణంలో కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతూ వస్తున్నారు అశ్వనీ దత్.
ఈ సందర్బంగా కొత్తగా మృణాల్ ఠాకూర్ తో దుల్కర్ సల్మాన్ తో సీతారామం సినిమాను నిర్మించారు. ఇది ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. నిర్మాతలకు పంట పండేలా చేసింది. ప్రత్యేకించి దర్శకుడి ప్రతిభ ఇందులో హైలెట్ గా నిలిచింది.
సీత, రామం ఎలా కలుసుకుంటారనే దానిపై తెరపై భావోద్వేగాలను పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ 2023కి గాను పురస్కారాలను ప్రకటించింది. తెలుగు సినిమా రంగానికి సంబంధించి ఉత్తమ చిత్రంగా సీతారామం ఎంపికైంది.
ఉత్తమ నూతన నటి కేటగిరీలో సీతారామం మూవీలో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది. ఇదే సమయంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైనందుకు గాను వైజయంతీ మూవీస్ తరపున సి. అశ్వనీదత్ అవార్డు అందుకున్నారు.