దుబాయ్ – సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం దుబాయ్ లో కన్నుల పండువగా జరిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినీ రంగాలకు చెందిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు కొలువు తీరారు.
దుబాయ్ నగరం తారళ తళుకు బెళుకులతో కళ కళ లాడింది. ఈ సందర్బంగా ముందుగా తెలుగు, కన్నడ సినీ రంగాలకు చెందిన వారికి అవార్డులను ప్రకటించి సైమా. తాజాగా తమిళం, మలయాళం సినీ రంగాలకు చెందిన వారికి పురస్కారాలకు ఎంపిక చేసింది.
తమిళ సినీ రంగానికి సంబంధించి అత్యుత్తమ చిత్రంగా, దర్శకుడిగా అవార్డులను అందుకున్నాడు జగ మెరిగిన దిగ్గజ దర్శకుడు మణిరత్నం. తమిళ రాష్ట్రానికి చెందిన సామాజిక చారిత్రక ఆధారంగా కథను తెర మీద ప్రదర్శించేలా చేశాడు . అదే ఆయన చేతిలో రూపు దిద్దుకున్న సినిమా పొన్నియన్ సెల్వన్ -1 .
ఒక రకంగా ఇది సినిమా కాదు..ఓ కళా ఖండం అని సైమా అవార్డ్స్ ఎంపిక కమిటీ ప్రశంసలు కురిపించింది. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలకు పెట్టింది పేరు మణిరత్నం. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ కథ బాగుంటే చాలు మూవీ సక్సెస్ అవుతుందన్నారు. తాను వీటిని పట్టించు కోనని స్పష్టం చేశారు.