దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ 2023 కార్యక్రమం అంగ రంగ వైభవంగా జరిగింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
ముందుగా తెలుగు, కన్నడ సినీ రంగాలకు చెందిన వారికి పురస్కారాలను అందించారు. తాజాగా తమిళం, మలయాళం సినీ రంగాలకు చెందిన నటీనటులు, దర్శకులు, గాయనీ గాయకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రకటించింది సైమా.
ఇందులో భాగంగా తమిళ సినీ రంగానికి ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి దిగ్గజ దర్శకుడు మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ -1 చిత్రానికి గాను అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తరణి మాట్లాడారు.
సైమా పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు కళా దర్శకుడు. ఈ అవార్డు రావడానికి ప్రధాన కారకుడు ఒకే ఒక్కరు టాప్ డైరెక్టర్ మణిరత్నం అని పేర్కొన్నారు. పొన్నియన్ సెల్వన్ కు సంబంధించి భారీ ఎత్తున అవార్డుల పంట పండింది.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ కళా డైరెక్టర్ అవార్డులు దక్కాయి ఈ చిత్రానికి.