దుబాయ్ – సైమా అవార్డ్స్ 2023 కు గాను తమిళ సినీ రంగానికి సంబంధించి అత్యుత్తమ నటన ప్రదర్శించినందుకు గాను లోకనాయుడిగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ ఎంపికయ్యారు. దుబాయ్ వేదికగా జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు కమల్ హాసన్.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు విక్రమ్ సినిమాకు. ఈ సినిమా కోట్లు కుమ్మరించేలా చేసింది. అంతే కాదు భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కలిగిన దర్శకులలో ఒకడిగా కనగరాజ్ గుర్తింపు పొందాడు.
ఇదే సమయంలో నటనలో తనకంటూ ఎవరూ సాటి రారంటూ ఇప్పటికే నిరూపించుకున్న నట దిగ్గజం విక్రమ్ లో విశ్వ రూపాన్ని ప్రదర్శించాడు. అంతే కాదు పాట కూడా పాడాడు. పాతాళ పాతాళ అంటూ ఆయన పాడిన ఈ సాంగ్ కు కూడా ఉత్తమ గాయకుడి కేటగిరీ కింద కమల్ హాసన్ ఎంపికయ్యాడు.
దీంతో ఉత్తమ నటుడు, ఉత్తమ సింగర్ అవార్డులు రెండూ లోక నాయకుడికి దక్కడం విశేషం. ఈ సందర్బంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఎన్నో అవార్డులు, పురస్కారాలు తనకు లభించాయని , కానీ దుబాయ్ వేదికగా మరోసారి పురస్కారం తీసుకోవడం సంతోషం కలిగిస్తోందన్నాడు.