దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ 2023లో మలయాళ చిత్ర రంగానికి సంబంధించి అత్యుత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు వినీత్ శ్రీనివాసన్. ఆయన దర్శకత్వం వహించిన హృదయం ఇటు ఇండియాలో అటు ఓవర్సీస్ లో దుమ్ము రేపింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. మ్యూజికల్ పరంగా బిగ్ హిట్ గా నిలిచింది.
వినీత్ శ్రీనివాసన్ పురస్కారాన్ని అందుకున్నారు. వినీత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు, గాయకుడు, రచయిత, ప్రయోక్త, నటుడు కూడా. మనసు పెట్టి హృదయం సినిమా తీశాడు. దీనికి సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఒక్క మూవీతో సెన్సేషన్ గా మారాడు.
ప్రముఖ స్క్రీన్ రైటర్ శ్రీనివాసన్ కుమారుడే ఈ వినీత్ శ్రీనివాసన్. వయసు 38 ఏళ్లు . కేరళ లోని కుతుపరంబలో పుట్టాడు వినీత్ శ్రీనివాసన్.చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు.మలయాళ సినీ రంగంలో సక్సెస్ ఫుల్ నటుడిగా పేరు పొందారు.
సైకిల్ చిత్రంతో అరంగేట్రం చేశాడు వినీత్ శ్రీనివాసన్. రెండో చిత్రం మాకంటే అచ్చన్ మూవీతో ఆకట్టుకున్నాడు. చాలా ఆల్బమ్ లకు సాహిత్యాన్ని అందించాడు. మాంపుల్లిక్కవిల్ , జిల్లు జిల్లు పాటలకు 2008లో బెస్ట్ మేల్ సింగర్ గా అవార్డు అందుకున్నాడు.
మలర్వాడి ఆర్ట్స్ క్లబ్ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. లెక్కలేనన్ని అవార్డులు, పురస్కారాలు అందుకున్నాడు వినీత్ శ్రీనివాసన్.