దుబాయ్ – సైమా అవార్డ్స్ 2023లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో తాజాగా తమిళం, మలయాళం సినీ రంగాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి.
తారల తళుకు బెళుకులతో దుబాయ్ కళ కళ లాడింది. భారీ ఎత్తున తారలు తరలి వచ్చారు. ఒక పండుగ వాతావరణం నెలకొంది అంతటా. తమిళ రంగానికి చెందిన త్రిష ఉత్తమ నటిగా ఎంపికైంది. మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ -1 చిత్రానికి గాను.
ఇదే సమయంలో మలయాళం సినీ రంగానికి సంబంధించి ఉత్తమ నటిగా కళ్యాణి ప్రియన్ కు అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆమె దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాళ్లు మొక్కారు. ఆయన ఆశీర్వదించారు. ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మలయాళంలో బ్రో డాడీ పేరుతో వచ్చిన చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో అద్భుతమైన నటనను ప్రదర్శించింది కళ్యాణి ప్రియన్. ఇందుకు గాను సైమా అవార్డ్స్ ఎంపిక కమిటీ ఏరికోరి ఈ నటిని ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ కలలో కూడా అనుకోలేదన్నారు ప్రియన్.