దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డుల ప్రధానోత్సవంలో ప్రముఖ గాయని మంగ్లీకి అరుదైన గౌరవం లభించింది. తెలుగు సినిమా రంగానికి సంబంధించి అత్యుత్తమ సింగర్ కేటగిరీలో బెస్ట్ గాయకురాలిగా అవార్డు దక్కింది. ఈ సందర్భంగా పురస్కారాన్ని అందుకుంది మంగ్లీ.
తొలుత యాంకర్ గా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత జానపద గాయకురాలిగా గుర్తింపు పొందింది. అనంతరం సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో తన గొంతుతో మెస్మరైజ్ చేసింది.
జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ , పూజా హెగ్డే కలిసి నటించిన అల వైకుంఠ పురంలో చిత్రంలో మంగ్లీ , కులకర్ణి పాడిన రాములో రాములా అన్న పాట రికార్డులు బ్రేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా హయ్యెస్ట్ వ్యూస్ కలిగిన సాంగ్ గా నిలిచింది.
సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ సింగర్ గా మంగ్లీ ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతుండడం విశేషం. ఆమె ఈషాలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రతి శివరాత్రికి కోయంబత్తూరులో జరిగే ప్రోగ్రాంలో తన పాటలతో మెస్మరైజ్ చేస్తూ వస్తున్నారు మంగ్లీ.