దుబాయ్ – తనకు పురస్కారం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు కన్నడ నటి శుభ రక్ష. దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ 2023కి సంబంధించి పెద్ద ఎత్తున పురస్కారాల కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది.
తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినీ రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నడ చిత్ర రంగానికి సంబంధించి ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ చిత్రంగా 777 చార్లీ ఎంపికైంది. ఇదే సమయంలో ఉత్తమ నటిగా కన్నడ చిత్ర పరిశ్రమలో బిగ్ సక్సెస్ అయిన హోం మినిష్టర్ లో నటించిన శుభ రక్ష ఎంపికైంది.
అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను సైమా ఉత్తమ నటిగా ఎంపికైంది శుభ రక్ష. ఈ సందర్బంగా ఆమె ప్రసంగించారు. సినిమాలో నటిస్తానని, అందులో తనకు పురస్కారం దక్కుతుందని తాను కూడా అనుకోలేదని అన్నారు శుభ రక్ష.
ఇక తెలుగు చిత్ర రంగానికి సంబంధించి చూస్తే ఉత్తమ చిత్రంగా సీతా రామం, ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల, ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి ఎంపికయ్యాడు.