దుబాయ్ వేదికగా సైమా అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ప్రతి ఏటా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చలన చిత్ర పరిశ్రమల నుండి నటీనటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తూ వస్తోంది.
కన్నడ చిత్ర రంగానికి సంబంధించి కాంతారా సినిమాలో అద్బుతమైన నటనతో ఆకట్టుకున్న నటుడు రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రం 777 చార్లీ, సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ కార్తికేయ 2 , ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడుగా కాంతారా చిత్రానికి అచ్యుత్ కునార్ ఎంపికయ్యారు.
ఇక ఉత్తమ సహాయ నటుడిగా గాలిపాట2 లో నటించిన దిగంత్ మంచాలే, ఉత్తమ సహాయ నటిగా శుభ రక్ష, ఉత్తమ నూతన నిర్మాతగా అపేక్ష పురోహిత్, పవన్ కుమార్ వడెయార్ , ఉత్తమ నూతన నటి పృథ్వీ శామనూర్ ఎంపికయ్యారు.
ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమ రంగానికి సంబంధించి చూస్తే ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల, మృణాల్ ఠాకూర్ అవార్డులు అందుకున్నారు.