సైమా అవార్డ్స్ 2023 సంవత్సరానికి ప్రకటించారు. ఉత్తమ నటుడిగా తెలుగు సినీ రంగానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కు దక్కగా ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్ నిలిచింది. ఇది 11వ ఎడిషన్ కావడం విశేషం.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ప్రతి ఏటా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చలన చిత్ర పరిశ్రమల నుండి నటీనటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి పురస్కారాలు అందజేస్తుంది.
దుబాయ్ వేదికగా ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమం జరిగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ చిత్రంగా సీతారామం, ఉత్తమ నూతన నటిగా సీతా రామంలో నటించిన మృణాల్ ఠాకూర్ ఎంపికైంది.
ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్ గా శృతీ హాసన్ , ఉత్తమ నూతన నిర్మాతల కేటగిరీలో శరత్, అనురాగ్ , నూతన నటుడు బెల్లంకొండ గణేష్ , ఉత్తమ ప్రతి నాయకుడిగా అడవి శేష్, ప్రధాన పాత్రలో ఉత్తమ నటి ధమాకా సినిమాలో నటించిన శ్రీలీల ఎంపికయ్యారు.
కన్నడ చిత్ర రంగానికి వస్తే ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ చిత్రం 777 చార్లీ, సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ కార్తికేయ 2 , ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడుగా కాంతారా చిత్రానికి అచ్యుత్ కునార్, ఉత్తమ సహాయ నటుడిగా గాలిపాట2 లో నటించిన దిగంత్ మంచాలే, ఉత్తమ సహాయ నటిగా శుభ రక్ష, ఉత్తమ నూతన నిర్మాతగా అపేక్ష పురోహిత్, పవన్ కుమార్ వడెయార్ , ఉత్తమ నూతన నటి పృథ్వీ శామనూర్ ఎంపికయ్యారు.