దుబాయ్ – సైమా అవార్డ్స్ 2023లో భాగంగా దుబాయ్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఇప్పటి వరకు తెలుగు, కన్నడ సినీ రంగాలకు సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించారు విజేతలుగా.
తాజాగా తమిళ, మలయాళం సినీ రంగాలకు చెందిన వారికి అవార్డులను వెల్లడించారు. ఇందులో భాగంగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ -1 చిత్రానికి భారీ ఎత్తున అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో మణిరత్నంకు పురస్కారం లభించింది.
ఇక ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న త్రిష కృష్ణన్ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఈ సందర్బంగా త్రిష మాట్లాడారు. తనకు అవార్డు రావడం వెనక తన కృషి ఏమీ లేదన్నారు. కేవలం ఈ క్రెడిట్ అంతా సూపర్ డైరెక్టర్ మణిరత్నంకు దక్కుతుందని చెప్పారు నటి.
సినిమాటోగ్రాఫ్ తో పాటు పాటల రచయిత కేటగిరీలో కూడా పొన్నియన్ సెల్వన్ -1 నిలిచింది. మొత్తంగా త్రిష కృష్ణన్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. మణిరత్నం అంటేనే క్లాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ సినిమాకు మరోసారి ప్రాణం పోశారు. బ్యూటిఫుల్ పోయెటిక్ గా తీశారు.