Sidhu Moose Wala: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్ కౌర్… ఐవీఎఫ్ (IVF) ద్వారా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సిద్ధూ తండ్రి 60 ఏళ్ల బాల్‌కౌర్ సింగ్… ఆదివారం ఉదయం బాబును ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియా పోస్ట్ చేసారు. ‘శుభ్‌దీప్ (సిద్దు మూసేవాలా అసలు పేరు)ను ప్రేమించిన లక్షలాది మంది ఆశీర్వాదాలతో అతడికి ఓ తమ్ముడు పుట్టాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను’ అని ఆయన రాసుకొచ్చాడు. అదే ఫోటోలో లెజెండ్స్‌కు చావు ఉండదంటూ సిద్దూ మూసేవాలా ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో ఉంది. ఇది చూసిన అభిమానులు… సిద్దు మూసేవాలా(Sidhu Moose Wala) మళ్లీ పుట్టాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రముఖ పంజాబ్ ర్యాపర్ సిద్దు మూసేవాలాను 2022 మే 29న దారుణంగా హత్య చేశారు. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో దుండగులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న నిజాన్ని సిద్దూ పేరెంట్స్ బాల్‌కౌర్ సింగ్, చరణ్ కౌర్ జీర్ణించుకోలేకపోయారు. అయితే లెజెండ్స్‌కు చావు ఉండదని నమ్మారు. తన కొడుకును మళ్లీ చూసుకోవాలని మురిసిపోయారు. ఈ క్రమంలో 58 ఏళ్ల వయసులో సిద్దు తల్లి చరణ్ కౌర్ ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోందని వార్తలు వెలువడ్డాయి. అయితే సిద్దు తండ్రి బల్కౌర్ సింగ్ స్పందిస్తూ అదంతా ఏమీ లేదని, ఏ రూమర్స్‌నూ పట్టించుకోవద్దని చెప్పాడు. కట్ చేస్తే ఐవీఎఫ్ ద్వారా సిద్దూకు(Sidhu Moose Wala) తమ్ముడు పుట్టాడంటూ… బాల్కౌర్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
Sidhu Moose Wala – సిద్దూ మూసేవాలా మరణంపై పుస్తకం
దివంగత పంజాబ్ ర్యాపర్ సిద్దూ మూసేవాలా జీవిత కథ ఆధారంగా ‘హూ కిల్డ్ మూసేవాలా ? ది స్పైరలింగ్ స్టోరీ ఆఫ్ వాయలెన్స్ ఇన్ పంజాబ్’ అనే పుస్తకం కూడా వచ్చింది. జుపిందర్ జీత్ సింగ్ రచించిన ఈ పుస్తకం… పంజాబ్ లో గ్యాంగ్‌స్టర్ల ఆధిపత్యం, మాదకద్రవ్యాల వినియోగం, ఆ రాష్ట్రంలో సంగీత ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను చూపించింది.
Also Read : Mansoor Ali Khan: వివాదాస్పద నటుడు మన్సూర్‌కు ఊహించని దెబ్బ ! స్థాపించిన పార్టీలోనే వేటు!