Siddu Jonnalagadda: స్టార్‌ హీరోయిన్‌ తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి !

స్టార్‌ హీరోయిన్‌ తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి !

Hello Telugu - Siddu Jonnalagadda

Siddu Jonnalagadda: టాలీవుడ్ లో పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. కొణిదెల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ, రకుల్ ప్రీత్ సింగ్, రౌడీ బాయ్స్ ఫేం అశీష్ రెడ్డి, మీరా చోప్రాలు ఇటీవలే పెళ్ళి పీటలెక్కగా… వరలక్ష్మి శరత్ కుమార్, కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో యువ హీరో పెళ్ళి ప్రస్తావన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు… అంతేకాదు ఇండస్ట్రీకు చెందిన ఓ టాప్ హీరోయిన్ ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇదే విషయంపై తాజాగా సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జోన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Siddu Jonnalagadda Movie Updates

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో… సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఒక స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని… వచ్చే ఏడాదిలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి అనే ప్రశ్నకు చైతన్య ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ‘స్టార్ హీరోయిన్‌ ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదు… అదే స్టార్ హీరోని చేసుకుంటేనే ప్రాబ్లమ్‌ అవుతుంది కదా అని నవ్వేశాడు. సిద్ధూకి కూడా పెళ్లి చేసుకోవాలని ఆసక్తి అయితే ఉంది. కానీ స్టార్ హీరోయిన్‌ నే పెళ్లి చేసుకుంటాడో లేదో తనకు తెలియదని చెప్పారు. అన్నీ కుదురితే వచ్చే ఏడాది పెళ్లి కూడా జరగవచ్చని చెప్పారు. ‘డి.జె టిల్లు’ సినిమాతో బాగా పాపులర్‌ అయిన సిద్దూ… యూత్‌ లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. దీనితో ‘టిల్లు స్క్వేర్’​తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Also Read : Mrunal Thakur: ప్రభాస్‌ కు జోడీగా ‘సీతారామం’ బ్యూటీ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com