Aditi Rao Hydari : సిద్ధార్థ్ అదితిని ఆ ఫుడ్ పెట్టి ప్రేమలో పడేసాడ..!

నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. కొన్నేళ్ల క్రితమే తను చనిపోయింది...

Hello Telugu - Aditi Rao Hydari

Aditi Rao Hydari : ఈ ఏడాది బాలీవుడ్‌లో ‘హీరామండీ’తో సూపర్‌హిట్‌ కొట్టిన అదితీరావు(Aditi Rao Hydari) హైదరి నచ్చినవాడిని (హీరో సిద్ధార్థ్‌) సాంప్రదాయబద్ధంగా మనువాడి, వివాహబంధంలోకి అడుగుపెట్టింది. హీరో సిద్ధార్థ్‌‌(Siddharth)తో ఆమె ప్రేమ, నిశ్చితార్థం, పెళ్లి అన్నీ కూడా హాట్ టాపిక్‌గా మారి టాక్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఇక తన లవ్‌ జర్నీ గురించి ఈ హైదరాబాద్‌ సోయగం పంచుకున్న తాజా ముచ్చట్లివి… మా ఇద్దరి పరిచయం ‘మహాసముద్రం’ సినిమాతో మొదలైందనేది తెలిసిందే. ఓరోజు సిద్ధూ సెట్లోకి అలా నడుచుకుంటూ వస్తూ ‘హలో బ్యూటీఫుల్‌ గర్ల్‌’ అని పలకరించాడు. సాధారణంగా నన్నెవరైనా అలా పిలిస్తే అస్సలు నచ్చదు. కానీ సిద్ధార్థ్‌(Siddharth) పలకరింపులో నాకు నిజాయితీ వినిపించింది. ఆ రోజంతా నాతో పాటు, సెట్‌లో అందరితోనూ సరదాగా గడిపాడు. షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు నాకు, టీమ్‌కు తన కుక్‌తో ప్రత్యేకంగా నేతి ఇడ్లీలు తయారు చేయించి తీసుకొచ్చేవాడు. అలా మొదలైన మా పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.

Aditi Rao Hydari Comment

నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. కొన్నేళ్ల క్రితమే తను చనిపోయింది. ఆమెకు హైదరాబాద్‌లో ఓ స్కూల్‌ ఉంది. చిన్నప్పుడు ఎక్కువగా ఆ స్కూల్లోనే గడిపేదాన్ని. మా అమ్మమ్మ జ్ఞాపకాలతో నిండిన ఆ చోటు అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. ఆ విషయం సిద్ధూకి తెలిసి.. ఓసారి మాటల్లో నన్ను ఆ స్కూల్‌కి తీసుకెళ్లమన్నాడు. ఓ రోజు నాతో పాటు సిద్ధూని వెంటతీసుకెళ్లా. అక్కడికెళ్లగానే మోకాళ్ల మీద కూర్చొని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని సినిమాటిక్‌ స్టైల్‌లో అడిగాడు. మా ప్రేమకు అమ్మమ్మ ఆశీస్సులు ఉండాలనే, స్కూలుకు వెళ్దామన్నాడని తెలిసి ఏమాత్రం ఆలోచించకుండా ‘యస్‌’ చెప్పేశా. సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం తనకి చాలా ఇష్టం. తను ఇచ్చే సర్‌ప్రైజ్‌లను నేను బాగా ఎంజాయ్‌ చేస్తా. ఈ ఏడాది జూలైలో ఫ్యాషన్‌ వీక్‌ కోసం ఢిల్లీకి వెళ్లా. నాకు సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని.. తను షూటింగ్‌ త్వరగా పూర్తి చేసుకొని తెల్లవారుజామున మూడు గంటలకు విమానం ఎక్కి వచ్చేశాడు. ఏదేమైనా సిద్ధూ లాంటి మనిషి నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం.

మా ఇద్దరికీ ఖాళీ సమయం దొరికితే చాలు.. ఏయే ప్రదేశాల్ని చుట్టొద్దామా అని ప్లాన్స్‌ వేసుకుంటాం. ఈ ఏడాది మే నెలలో కేన్స్‌ చిత్రోత్సవం పూర్తయ్యాక ఇద్దరం కలిసి ప్యారిస్‌ వెళ్లాం. వారం పాటు అక్కడే గడిపాం. ఎంచక్కా అక్కడి వీధుల్లో తిరుగుతూ నచ్చిన ఫుడ్‌ని ఆస్వాదించాం. మా ఇద్దరికీ సంగీతం అంటే ప్రాణం. ఇద్దరం కలిస్తే ఇక గానా బజానానే. తను ట్యూన్‌ ప్లే చేయడం, నేను పాటలు అందుకోవడం… రోజంతా సరదాగా గడిచిపోతుంది. ఇక వంటల విషయానికొస్తే నా కన్నా తనే బాగా వంట చేస్తాడు.

తను చేసే నాన్‌వెజ్‌ ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఒకవేళ మా ఇద్దరి మధ్య గొడవ జరిగితే నేనే ముందు సారీ చెప్తా. నచ్చిన వ్యక్తి కనబడితే ‘ఇతడు నావాడు’ అని మనసు చెబుతుందంటారు కదా! సిద్ధూను మొదటిసారి కలిసినప్పుడు నా మనసుకు కూడా అదే అనిపించింది. ఏదో తెలియని ఫీలింగ్‌. తనతో జీవితాంతం కలిసుంటే ఎంత బాగుంటుందో అనుకున్నా. సిద్ధూలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే.. ఎప్పుడూ తను నవ్వుతూ, చుట్టూ ఉన్న వాళ్లని నవ్విస్తుంటాడు. నిజానికి మా ఇద్దరివీ చిన్న పిల్లల మనస్తత్వాలు. ఇద్దరం బాగా అల్లరి చేస్తాం.

Also Read : Hero Varun Tej : సినిమా ప్రియులకు ‘మట్కా’ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com