దుబాయ్ – సైమా అవార్డ్స్ 2023 సందర్బంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో యూత్ ఐకాన్ అత్యుత్తమ నటి అవార్డును స్వంతం చేసుకుంది తమిళ సినీ రంగానికి చెందిన శృతీ హాసన్. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.
ఎన్నో అవార్డులు దక్కాయి. ఎన్నో సినిమాలలో చేస్తున్నా. కానీ భారతీయులు ఎక్కువగా నివసించే దుబాయ్ లో తాను సైమా తరపున పురస్కారం తీసుకోవడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు నటి.
ఆమె ప్రసిద్ద భారతీయ నటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురే ఈ శృతీ హాసన్. ఆమె తమిళ సినీ రంగంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలలో కూడా పలు సినిమాలలో నటించింది..మెప్పించింది.
ప్రస్తుతం శృతీ హాసన్ హాట్ టాపిక్ గా మారారు. కారణం ఏమిటంటే భారత సినీ రంగాన్ని షేక్ చేసిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు .
ఇందులో పాన్ ఇండియా హీరో డార్గింగ్ ప్రభాస్ తో పాటు శృతీ హాసన్ నటిస్తుండడం విశేషం. ఈ నెలలోనే సలార్ రానుందని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఆమె గతంలో మాస్ మహరాజా రవితేజ తో కలిసి నటించింది శృతీహాసన్. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.