నట దిగ్గజం కమల్ హాసన్ కూతురు శ్రుతీ హాసన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్. తను తమిళ్, తెలుగు, హిందీ సినిమాలలో ప్రస్తుతం బిజీగా ఉంటోంది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను డార్లింగ్ ప్రభాస్ తో కలిసి నటించిన సలార్ చిత్రం విడుదల కానుంది. దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉండగా సలార్ కు పోటీగా షారుక్ ఖాన్ నటించిన డుంకీ కూడా రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమా ఎఫెక్టు తమ మూవీపై పడుతుందని ఆందోళన చెందిన వాళ్లకు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చింది. సలార్ కు ఏ సినిమా పోటీ కాదని షాకింగ్ కామెంట్స్ చేసింది.
తాము ఎవరికీ పోటీ కాదని వేరే వాళ్లను తాము పోటీదారులుగా భావించడం లేదని కుండ బద్దలు కొట్టింది. కేజీఎఫ్ తో దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు పొందిన ప్రశాంత్ నీల్ ఈ సలార్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.
రాజు హిర్వానీ దర్శకత్వం లో షారుక్ నటించిన డుంకీ కూడా సలార్ కు పోటీగా విడుదల కాబోతోంది. దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు బాద్ షా. ఈ ఏడాది తనకు మంచి సక్సెస్ వచ్చింది. తను నటించిన రెండు సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. మొత్తంగా శ్రుతీ హాసన్ చేసిన ఘాటు కామెంట్స్ ఇప్పుడు టాపిక్ గా మారాయి. డుంకీ సినిమాను తాను పట్టించుకోనంటూ పేర్కొన్నారు.