Shruthi Hassan: ‘ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న హాలీవుడ్ సినిమా ‘చెన్నై స్టోరీ’. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవలే ఆమె తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సీటాడెల్ ఇండియా వెర్షన్ తో హాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత… ఈ పాత్రకు ఎంపికైనట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ ఆమెకున్న మయాసైటిస్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ‘చెన్నై స్టోరీ’ తప్పుకోవాల్సి వచ్చింది. దీనితో ఆ ఛాన్స్ ను ఒడిసి పట్టుకున్న శృతి హాసన్… ‘కొత్త సినిమా… కొత్త ప్రయాణం’ అంటూ ఆ సినిమా గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనితో ‘చెన్నై స్టోరీ’ లో డిటెక్టివ్ పాత్రకు శృతి హాసన్ యాప్ట్ అంటూ నెటిజన్లు ప్రశంసించారు.
Shruthi Hassan Movie Updates
అయితే ఇది జరిగి వారం రోజులు తిరగకముందే… ఈ క్రేజీ ప్రాజెక్టు నుండి శృతి హాసన్ కూడా ఔట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యే ప్రారంభమైన ‘చెన్నై స్టోరీ’ షూటింగ్ లోనూ పాల్గొన్నాని ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చిన శృతి హాసన్(Shruthi Hassan)… ఈ ప్రాజెక్టు నుండి ఔట్ అవ్వడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముందు సమంత… ఇప్పుడు శృతి హాసన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో నిజమెంత… ఒకవేళ నిజమైతే ఇప్పుడు ఈ అవకాశం ఏ నటికి దక్కుతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
Also Read : Tamannaah Bhatia: ‘బాక్’లో శివానిగా మిల్క్ బ్యూటీ తమన్నా ఫస్ట్ లుక్ అదుర్స్ !