Shriya Saran : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన శ్రేయ

ఆయన విషయంలో సహా నటిగా నేనెంతో గర్వంగా ఉన్నా...

Hello Telugu - Shriya Saran

Shriya Saran : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి నటి శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని ఓ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించిన ఆమె పవన్ రానున్న రోజుల్లో అద్భుతాలు చేస్తారని అన్నారు. పవన్, శ్రియ కలిసి ‘బాలు’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే! టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ఏ చిత్ర పరిశ్రమ అంటే ఇష్టమని ప్రశ్నించగా.. ఇండియన్‌ సినిమా అని చెప్పడం తనకు ఇష్టమన్నారు. ఆమె మాట్లాడుతూ ‘‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ అద్భుతమైన విజయం అందుకున్నారు.

ఆయన విషయంలో సహా నటిగా నేనెంతో గర్వంగా ఉన్నా. మేమిద్దరం గతంలో ‘బాలు’ కోసం కలిసి వర్క్‌ చేశాం. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు. శ్రమపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో పవన్ కాలికి గాయమైంది. పాట షూట్‌ పూర్తయ్యే వరకూ ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ తాపత్రయపడే వారు. ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. ఆయన అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతున్నా’’ అని శ్రియ(Shriya Saran) అన్నారు. అలాగే చిరంజీవితో కలిసి మరోసారి వర్క్‌ చేయాలనుకుంటున్నానని అన్నారు. చిరంజీవి, శ్రియ సూపర్‌హిట్‌ చిత్రం ‘ఠాగూర్‌’లో నటించిన సంగతి తెలిసిందే!

Shriya Saran Comment

ప్రస్తుతం శ్రీయ ‘షో టైమ్‌’ అనే కార్యక్రమం చేస్తున్నారు. బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయన్నారు. తెలుగులో తేజ సజ్జా మూవీ కోసం యాక్ట్‌ చేస్తున్నానని వెల్లడించారు. ” సినిమాకు ఇప్పుడు లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. ఆ హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు ఏ భాషా చిత్రమైన వీక్షిస్తున్నారు” అని అన్నారు.

Also Read : Hari Hara Veera Mallu : పవర్ స్టార్ సినిమాలో అనుపమ్ ఖేర్ రాక

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com