Shraddha Kapoor : స్త్రీ 2 తో హిట్ కొట్టిన ‘శ్రద్ధా కపూర్’ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా..!

ఈ సినిమాలో శ్రద్ధా లుక్స్, యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయ్యారు...

Hello Telugu - Shraddha Kapoor

Shraddha Kapoor : ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా స్త్రీ 2. గతంలో అంటే దాదాపు ఆరేళ్ల క్రితం వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో భారీ వసూళ్లతో సత్తా చాటుతుంది. ఇందులో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. అలాగే ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠీ కీలకపాత్రుల పోషించారు. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాకు రాజ్ కుమార్ రావు రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నాడట.

Shraddha Kapoor Movies

ఇక ఈ మూవీ కోసం హీరోయిన్ శ్రద్ధా కపూర్ రూ.5 కోట్లు అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో శ్రద్ధా లుక్స్, యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయ్యారు. చాలాకాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ స్త్రీ 2 బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమాలో కీలకపాత్రలో మెప్పించిన పంకజ్ త్రిపాఠి రూ. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అపరశక్తి ఖురానా రూ. 70 లక్షలు, అభిషేక్ బెనర్జీ,రూ.55 లక్షలు అందుకున్నారు. ఇక అతిథి పాత్రలో నటించిన వరుణ్ ధావన్ ఏకంగా రూ.2 కోట్లు తీసుకున్నారట.

Also Read : Ramya Krishnan : స్టార్ హీరోయిన్ కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే – రమ్య కృష్ణ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com