Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఇంతకీ సాయి పల్లవి ప్రమోషన్స్‌కి ఎందుకు అటెండ్ కావడం లేదు...

Hello Telugu - Sai Pallavi

Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి, శివకార్తికేయన్ జంటగా విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా అమరన్. ఈ సినిమా దీపావళి కానుకగా పలు భాషల్లో అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. కానీ.. సాయి పల్లవి(Sai Pallavi) ప్రమోషన్స్ అటెండ్ కాకుండా చేసిన పని చూస్తే మీరు గ్రేట్ అనాల్సిందే.. ఇంతకీ సాయి పల్లవి ప్రమోషన్స్‌కి ఎందుకు అటెండ్ కావడం లేదు.

Sai Pallavi…

అమరన్.. ఈ సినిమాని కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఆర్మీ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత సంఘటనలతో రాసిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌ : ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడరన్‌ మిలిటరీ’ పుస్తకం ఆధారంగా యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర సందేశాన్ని పోస్ట్ చేశారు. ” అమరన్ కోసం ప్రమోషన్‌లను ప్రారంభించే ముందు నేను నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించాలనుకున్నాను. ఈ పవిత్రమైన ఆలయంలో, మన కోసం తమ ప్రాణాలను అర్పించిన ప్రతి బ్రేవ్‌హార్ట్ జ్ఞాపకార్థం వేలకొద్దీ ‘ఇటుక లాంటి పలకలు’ ఉన్నాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్ లకు నివాళ్లు తెలుపుతున్నపుడు నా ఒళ్ళు పులకరించి పోయింది” అంటూ పోస్ట్ చేశారు. దీంతో అందరు సాయి పల్లవి గెస్చర్ కి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం నుండి గతంలో సాయి పల్లవి(Sai Pallavi) చేసిన వ్యాఖ్యలను తిరిగి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 2022లో వేణు ఉడుగుల దర్శకత్వంలో రాణా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రటిస్టులలా కనిపిస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. మనం హార్మ్ చేస్తామనుకుంటారు కాబట్టి. మనకు వాళ్లు అలానే కనిపిస్తారు.చూసే విధానం మారిపోతుంది. అందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పలేను” అన్నారు. దీంతో అప్పట్లో ఇండియన్ ఆర్మీ‌ని అగౌరవపరిచావంటూ కొందరు మనోభావాలు దెబ్బతీసుకున్నారు. ఇదే టాపిక్‌ని మరోసారి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చి ట్విట్టర్లో ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Also Read : Nayanthara : తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన నయనతార

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com