Shobana: ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్… సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తలైవా171’ (వర్కింగ్ టైటిల్) గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానరుపై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ‘తలైవా 171’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనుండగా… ఇందులో శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్… రజనీ కాంత్ అభిమానులకు సర్ ప్రైజ్ సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు ‘కళుగు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోని ఒక ముఖ్య పాత్రకు సీనియర్ నటి శోభనను నటింపజేసేందుకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
Shobana Movie Updates
శోభన ఇందులో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నప్పటి నుండి ఈ సినిమాకు బాగా వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే, గతంలో రజనీకాంత్‌తో శోభన(Shobana) పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు మళ్లీ అంటే.. ఇందులో రజనీకాంత్ ఏమైనా డబుల్ రోల్ చేస్తున్నారా ? అనేలా టాక్ మొదలైంది. అలాగే, ఇంతకు ముందు వచ్చిన ‘జైలర్’ తరహా పాత్రని మళ్లీ రజనీ చేయబోతున్నాడా ? అనేలా కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతుండటం విశేషం. కాగా.. స్టంట్స్ అన్బరివు అందిస్తుండగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించే ఈ చిత్రంలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Also Read : Allu Arjun : పుష్ప రాజ్ ను ప్రశంసలతో ముంచెత్తిన బోలీవుడ్ ప్రముఖ దర్శకుడు