Shivam Bhaje: గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అశ్విన్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ‘శివం భజే’ టైటిల్ లుక్ అందరిదృష్టిని ఆకర్షించగా… తాజాగా హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ఊర మాస్ అన్నట్లుగా ఉంది.
Shivam Bhaje Movie Updates
ఈ ఫస్ట్ లుక్ లో ఒంటి కాలి మీద నిలబడి… ఒంటిచేత్తో మనిషిని ఎత్తేసి రౌద్ర రూపంలో అశ్విన్ కనపడుతున్నారు. అఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, ఆ వెనక దేవుడి విగ్రహం చూస్తుంటే చిత్రంపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్(Aabaaz Khan), హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తుంది. ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. మా ‘శివం భజే’ టైటిల్‌కి మించిన స్పందన ఫస్ట్ లుక్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, మా నిర్మాత మహేశ్వర రెడ్డి సహకారంతో అంచనాలకి మించి చిత్రం రూపొందింది. మా టీజర్, పాటలు విడుదల సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘ఒక వైవిధ్యమైన కథతో, కథనాలతో అప్సర్ దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. టైటిల్, ఫస్ట్ లుక్ కి చాలా మంచి స్పందన వస్తోంది. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టవల్-24 ‘బెస్ట్ సినిమాటోగ్రఫీ’ అవార్డు గ్రహీత దాశరథి శివేంద్ర ఈ చిత్రంలో అదిరిపోయే విజువల్స్ అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా వినూత్నంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యప్తంగా జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని తెలిపారు.
Also Read : Kalki 2898AD: ‘కల్కి 2898 AD’ సీజీ వర్క్‌పై నిర్మాత, దర్శకుల ఫన్నీ ఛాటింగ్ !