Shiva Rajkumar : కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ తన ఆరోగ్యం గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. కేన్సర్ నుంచి కోలుకున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. ‘‘కేన్సర్ సోకిందని తెలిస్తే ఎవరికైనా భయం సహజం. ఆ భయం నా నుంచి దూరం చేసేందుకు నా భార్య గీత, అభిమానులు అందించిన సహకారం మరువలేనిది. వారందరికీ రుణపడి ఉంటాను. చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయడానికి చాలా కష్టపడ్డాను.
Shiva Rajkumar Comment
ఓ వైపు కీమోథెరపీ చేయించుకుంటూనే ‘45’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాను. నా ఆరోగ్యం విషయంలో వైద్యులు అందించిన సహకారం మరువలేనిది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. శివన్న భార్య గీత మాట్లాడుతూ ‘‘నా భర్త కేన్సర్‌ను జయించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఆయన్ని అభిమానించే వారందరికీ ఇది తీపి కబురులాంటిది. త్వరలోనే కర్ణాటకకు తిరిగి వస్తాం’’ అని అన్నారు.
Also Read : Happy New Year 2025 : ‘హలో తెలుగు’ ప్రేక్షకులకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు