Shiva Raj Kumar : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ , తమన్నా భాటియా నటించిన జైలర్ దుమ్ము రేపుతోంది. సూపర్ స్టార్ కెరీర్ లో అతి తక్కువ సమయంలో కోట్లు కొల్లగొట్టింది. ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది.
Shiva Raj Kumar Trending for Jailer
ఈ చిత్రంలో రజనీకాంత్ నటన హైలెట్ గా నిలిస్తే..కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar), మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ అద్భుతంగా నటించి మెప్పించారు. వీరితో పాటు తమిళ కమెడియన్ యోగి బాబు స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.
ఎప్పటి లాగే సూపర్ స్టార్ మేనరిజం, కథలో బలం ప్రేక్షకులను కట్టి పడేలా చేసింది. ఇక అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ కావాలయ్యా పాట ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా జైలర్ సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో టీం అంతా ఫుల్ ఖుష్ లో ఉన్నారు. కన్నడ నాట శివ రాజ్ కుమార్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. జైలర్ చిత్రంతో మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు ఇచ్చిన పాత్రలో.
శివ రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ చుట్టు ముడుతున్నారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడుతున్నారు. మరిన్ని సినిమాలలో నటించాలని కోరుతున్నారు.
Also Read : Bhola Shankar OTT Release : నెట్ ఫ్లిక్స్ లో భోళా శంకర్