Shiva Nirvana : విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు కలిసి నటించిన ఖుషి చిత్రంపై డివైడ్ టాక్ వినిపిస్తోంది. శివ నిర్వాణ్(Shiva Nirvana ) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్వతహాగా రచయితగా పేరు పొందిన నిర్వాణ గతంలో మజిలీ అనే చిత్రం తీశాడు. తాజాగా రౌడీ బాయ్ తో మూవీ తెరకెక్కించాడు.
Shiva Nirvana Director of Kushi Movie
సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఖుషి సినిమాను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రతి చోటా అద్భుతంగా తీశాడని కొందరు అంటుంటే మరికొందరు అంతగా బాగో లేదంటూ పెదవి విరుస్తున్నారు.
ఈ తరుణంలో ఖుషి చిత్రంపై కావాలని దుష్ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమాపై తాజాగా స్పందించారు. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ఎలిమెంట్ ఇందులో ఉండేలా జాగ్రత్త పడ్డానని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా చిత్రాన్ని దృశ్య కావ్యంగా ఉండేలా చూడడంలో ఎక్కువగా దృష్టి పెట్టాడు డైరెక్టర్. పాటలు సినిమాకు హైలెట్ గా మరాయి. అంతే కాదు చిత్రానికి సంబంధించిన సీన్స్ గుండెల్ని మీటేలా చాలా కష్టపడ్డాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇక సమంత పుష్ప మూవీలో ఐటం సాంగ్ తో దుమ్ము రేపింది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన విజయ్ దేవరకొండ లైగర్ ఆశించిన మేర సక్సెస్ కాలేదు.
Also Read : Kanguva Movie : అందరి చూపు కంగువ వైపు