Ilayaraja : మ్యాజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilayaraja) సంగీతం అందించిన చిత్రం షష్టిపూర్తి. ఈ సినిమాకు సంబంధించి మూవీ మేకర్స్ తాజాగా మరో సాంగ్ ను విడుదల చేశారు. హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇరు కనులు కనులు పాట చిత్రీకరణ, స్వరకల్పన అద్భుతంగా ఉంది. మనసులను మెలిపెట్టేలా సాగింది. లలితమైన పదాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రూపేష్, ఆకాంక్ష ఇందులో నటించారు. దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం వారసుడిగా పేరు పొందిన ఎస్పీ చరణ్ మరోసారి తన వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు.
Ilayaraja Music
షష్టిపూర్తి సినిమాకు పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. మా ఐ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపేష్ నిర్మించారు. ఇరు కనులు కనులు పాటను రెహమాన్ రాశారు. ఎస్పీ చరణ్ , విభావరి ఆప్టే జోషి హృద్యంగా పాడారు. ఈ మూవీలో మరో కీలక పాత్రలు పోషించారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నేషనల్ అవార్డు విన్నర్ అర్చన, రూపేష్ , ఆకాంక్ష సింగ్ .
వీరే కాకుండా ప్రభాస్ శ్రీను, చలాకీ చంటి, చక్రపాణి ఆనంద, అచ్యుత్ కుమార్, మురళీధర్ గౌడ్, అనిల్, జబర్దస్త్ రామ్, లత, శ్వేత, రూహి, సంజయ్ స్వరూప్, అంబరేష్ అప్పాజీ, అనుపమ, మహి రెడ్డి, ఫిరోజ్ ఇతర పాత్రలలో నటించారు. కథ, సన్నివేశం, సంభాషణలు, దర్శకత్వం అంతా పవన్ ప్రభ నిర్వహించారు. ఈ సినిమాకు పాటలను రాశారు ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, చైతన్య ప్రసాద్, రెహమాన్ .
Also Read : Hero Vijay -Kingdom :విజయ్ బోర్సే ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్