Sharwanand : ఒక్కో దర్శకుడిది ఒక్కో టేస్ట్. టాలీవుడ్ లో సాంగ్స్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ప్రేక్షకులు కూడా వాటిని ఆస్వాదిస్తారు. ముందు నుంచి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. సినిమా సక్సెస్ కు సాంగ్స్ కీలకం కానున్నాయి. ఇందుకే ప్రత్యేకించి దర్శక, నిర్మాతలు ఫీల్ గుడ్ అనిపించేలా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. చిత్రీకరణ కూడా జాగ్రత్తగా ఉండేలా చూస్తున్నారు. తాజాగా పాటలకు సంబంధించి నారీ నారీ నడుమ మురారి మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో శర్వానంద్(Sharwanand), మలయాళ నటి సంయుక్తా మీనన్ కలిసి నటిస్తున్నారు.
Sharwanand – Darshaname Movie Updates
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన దర్శనమే పాట ప్రోమోను విడుదల చేశారు(Darshaname). ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. యాజిన్ నిజార్ హృద్యంగా పాడారు ఈ పాటను. సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి దీనిని రాశారు. మెహతాబ్ అలీ నియాజీ సితార్ అందించగా అరవింద్ అన్నెస్ట్, శిబి శ్రీనివాసన్, వేలు, కవిత ఇలంగో, ఆర్తి ఎంఎన్ అశ్విన్, దేవు మాథ్యూ సుందర్ శివరామకృష్ణన్ సహకారం అందించారు ఈ పాటకు.
నారీ నారీ నడుమ మురారీ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. భాను భోగవరపు కథను అందిస్తున్నారు. నందు సవిరిగాన మాటలు రాశారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఇదే పేరుతో నందమూరి బాలకృష్ణ తీశారు. అప్పట్లో అది బిగ్ హిట్ గా నిలిచింది. కేవీ మహదేవన్ సంగీతం అందించారు.
Also Read : Sivaji-Dandora Movie Sensational :వాస్తవాలకు దర్పణం దండోరా చిత్రం