Shankar Mahadevan: సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డు అందుకోవడం పట్ల శంకర్ మహదేవన్(Shankar Mahadevan) ఆనందంలో పరవశిస్తున్నారు. గ్రామీ అవార్డు అందుకున్న ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేయడం ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్ స్టాలో ఫోటోలతో పాటు ఓ ఎమెషనల్ కామెంట్ పోస్ట్ చేసారు శంకర్ మహదేవన్. ‘‘ఎక్కడైతే సంగీతం నేర్చుకున్నానో ఆ బ్యాండ్‌తో కలిసి గ్రామీ అవార్డు అందుకుంటానని ఊహించలేదు. శక్తి బ్యాండ్ నా కలను నిజం చేసింది. మేము అనుకున్నది సాధించాం. కలలు సాకారం అవుతాయని చెప్పడానికి ఇదే సరైన సమయం ’’ అని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు. దీనితో శంకర్ మహదేవన్ పెట్టిన పోస్ట్‌కు ఆయన అభిమానులు స్పందిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘నిజంగా ఇది గర్వించదగ్గ క్షణం’, ‘మీరు ఈ అవార్డుకు అర్హులు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Shankar Mahadevan Comment
శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్ ల ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా గ్రామీ అవార్డును అందుకొంది. ‘శక్తి’ బ్యాండ్ పేరిట ఈ పాటను ఎనిమిది మంది ప్రతిభావంతులైన సంగీత కళాకారులు కంపోజ్ చేశారు. ఆదివారం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో… శక్తి బ్యాండ్ ఈ అవార్డును అందుకుంది. సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డు అందుకోవడం పట్ల జాకిర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన శక్తి బ్యాండ్… గ్రామీ అవార్డును అందుకోవడంపై ప్రధాని మోదీ కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘సంగీతంపై మీకున్న అంకితభావంతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది. ఈ విజయం మీ కష్టానికి నిదర్శనం. కొత్తతరం కళాకారులు పెద్ద కలలు కనేలా మీరు స్ఫూర్తి నింపారు’ అంటూ మోదీ పోస్ట్ పెట్టారు.
Also Read : Hrithik Roshan: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ కు మరో ఎదురుదెబ్బ !