Shahid Kapoor : రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన చిత్రం దేవా. ఇందులో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, లవ్లీ బ్యూటీ పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు దర్శకుడు. ఇవాల్టి నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. షాహిద్, పూజా అభిమానులకు ఇది ఒక రకంగా తీపి కబురు అని చెప్పక తప్పదు. భాసద్ మచా ట్రిగ్గర్ చాలా దేవా ఆ రహా హై అని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
Shahid Kapoor-Pooja Hegde Movie Updates
ఈ సినిమాలో షాహిద్(Shahid Kapoor) హై-ప్రొఫైల్ కేసును పరిశోధించే తిరుగుబాటుదారుడైన పోలీసు అధికారిగా నటించాడు. మోసం, ద్రోహం సంక్లిష్టతతో కూడుకున్న వలయాన్ని ఛేధించే పాత్రలో నటించాడు. ఇందులో స్పెషల్ పాత్రను పోషించింది పూజా హెగ్డే. తను ఇందులో జర్నలిస్ట్ పాత్రలో లీనమై నటించింది. మరింత రోమాంటిక్ సీన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇందులో కిస్ సీస్ మరింత ఆకట్టుకునేలా తీశాడు డైరెక్టర్.
సిద్ధార్థ్ రాయ్ కపూర్ దేవా మూవీని నిర్మించాడు. థ్రిల్స్ , యాక్షన్ ప్యాక్డ్ రోలర్ కోస్టర్ రైడ్ గా రూపొందిన ఈ మూవీ జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. ఇదే సమయంలో షాహిద్ కపూర్ మరో ప్రాజెక్టుపై సంతకం చేశాడు. రాబోయే నెలల్లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నాడు. గతంలో ప్రియాంక చోప్రాతో కామినే, శ్రద్దాకపూర్, టబుతో హైదర్, కంగనా రనౌత్, సైఫ్ అలీ ఖాన్ తో రంగూన్ చిత్రాలలో నటించాడు.
Also Read : Hero Chiranjeevi Movie :మెగాతో మూవీ ఫిక్స్ వచ్చే సంక్రాంతికి రిలీజ్