Shahid Kapoor: ఆధునిక ‘అశ్వత్థామ’ గా షాహిద్ కపూర్ !

ఆధునిక ‘అశ్వత్థామ’ గా షాహిద్ కపూర్ !

Hello Telugu - Shahid Kapoor

Shahid Kapoor: బాలీవుడ్‌ స్టార్ హీరో షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న కన్నడ దర్శకుడు సచిన్‌ రవి సినిమాకు ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్‌’ టైటిల్‌ ఖరారైంది. వసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను అధికారికంగా తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్బంగా దర్శకుడు సచిన్‌ రవి మాట్లాడుతూ… ‘‘మహా భారతంలోని అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉంటారని కొందరి నమ్మకం.

Shahid Kapoor Movie Updates

మహాభారత కాలంనాటి ఓ అమరుడు ఇప్పటి ఆధునిక కాలానికి వస్తే ఏం జరుగుతుంది ? అనే అంశాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో లెజెండ్స్‌ యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ నుత్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాత జాకీ భగ్నాని తెలిపారు.

Also Read : Spider-Man: స్పైడర్‌ మేన్‌ మళ్లీ వస్తున్నాడు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com