బాలీవుడ్ స్టార్లలో తనకు ఎదురే లేదని చాటాడు బాద్ షా షారుక్ ఖాన్. ఈ ఏడాది ఆయనకు అచ్చొచ్చింది. తను కూడా ఊహించని రీతిలో తను నటించిన రెండు సినిమాలు రికార్డుల మోత మోగించాయి. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన పఠాన్ రికార్డ్ మోత మోగించింది. ఏకంగా రూ. 1,000 కోట్లు కలెక్షన్స్ సాధించింది. తన సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది.
ఇదే సమయంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ దుమ్ము రేపింది. భారీగా వసూలు చేసింది. తన కెరీర్ లో ఇది మరిచి పోలేని సినిమా అని ఈ సందర్బంగా పేర్కొన్నాడు బాద్ షా షారుక్ ఖాన్.
తాజాగా ఆయన హాట్ టాపిక్ గా మారాడు. కారణం ప్రముఖ బారతీయ మీడియా సంస్థ ఆర్మాస్ ప్రతి నెలా టాప్ హీరోస్ ఎవరు అనే దానిపై లిస్టు ప్రకటిస్తుంది. నెంబర్ వన్ పొజిషన్ లో షారుక్ నిలిచాడు. 2వ స్థానంలో అక్షయ్ కుమార్, 3వ స్థానంలో సల్మాన్ ఖాన్ , 4వ స్థానంలో హృతిక్ రోషన్ , 5వ స్థానంలో రణ బీర్ కపూర్ నిలిచారు.
ఇక 6వ స్థానంలో కార్తీక్ ఆర్యన్, 7వ స్థానంలో రణ వీర్ సింగ్ , 8వ స్థానంలో అమీర్ ఖాన్ , 9వ స్థానంలో ఆయుష్మాన్ ఖురానా, 10వ స్థానంలో సిద్దార్థ్ మల్హోత్రా నిలిచారు.