Shah Rukh Khan Visit : తిరుమ‌లలో బాద్ షా సంద‌డి

శ్రీవారి స‌న్నిధిలో జ‌వాన్ టీం

Hellotelugu-Shah Rukh Khan Visit

Shah Rukh Khan Visit : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ , జ‌వాన్ టీంతో క‌లిసి తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారిని వేడుకున్నారు. ఆయ‌న అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన జ‌వాన్ సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. త‌న‌తో పాటు త‌మిళ అందాల తార న‌య‌న‌తార‌, బ్యూటీ క్వీన్ దీపికా ప‌దుకొనే , విజ‌య్ సేతుప‌తి న‌టించారు.

Shah Rukh Khan Visit Tirumala

అనిరుధ్ ర‌విచంద‌ర్ జ‌వాన్ కు సూప‌ర్బ్ మ్యూజిక్ అంద‌జేశారు. రూ. 200 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించాడు అట్లీ కుమార్. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్, ట్రైల‌ర్ , సాంగ్స్ అదుర్స్ అనిపించేలా చేశాయి.

విచిత్రం ఏమిటంటే సినిమా విడుద‌ల కాకుండానే బ్రేక్ ఈవెన్ రావడం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 350 కోట్లు కొల్ల‌గొట్టింది. ఎంతో ఆస‌క్తితో ఈ చిత్రంపై షారుక్ ఖాన్(Shah Rukh Khan) ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో డ‌బుల్ రోల్ పోషిస్తున్నాడు బాద్ షా. అడ్వాన్స్ బుకింగ్ లోనూ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్ప‌టి దాకా 5 ల‌క్ష‌ల టికెట్లు అమ్ముడు పోయాయి.

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న వారిలో షారుక్ ఖాన్ , కూతురు సుమానా ఖాన్ , జ‌వాన్ స‌హ న‌టి న‌య‌న తార‌, భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ , ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్ సుప్ర‌భాత సేవ‌లో పూజ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా ఉండ‌గా షారుక్ ఖాన్ త‌న కెరీర్ లో తొలిసారిగా తిరుమ‌ల‌కు రావ‌డం విశేషం.

Also Read : Kushi Movie Team Visit : సింహాచ‌లం స‌న్నిధిలో ఖుషి బృందం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com