Shah Rukh Khan : రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్(Shah Rukh Khan), విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘జవాన్’. సుమారు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా… ప్రపంచ వ్యాప్తంగా రూ. 1150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన మోస్ట్ పాపులర్ చిత్రాల జాబితాలోనూ మొదటి స్థానంలో నిలిచింది. దీనిపై దర్శకుడు అట్లీ స్పందిస్తూ… ‘జవాన్’ కొన్ని కోట్ల మంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ప్రేక్షకులు చూపిన ప్రేమను మర్చిపోలేనంటూ కృతజ్ఞతలు తెలిపారు.
Shah Rukh Khan – ‘అస్త్ర’ అవార్డుల కోసం నామినేట్ అయిన ‘జవాన్’
ప్రతి ఏటా ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డుల పండగ ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డులను ‘అస్త్ర’ అవార్డులుగా పేరు మార్చారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘జవాన్’… ఇప్పుడు ‘అస్త్ర’ అవార్డులుగా వేటలో పడింది. 2024కు గానూ ‘అస్త్ర’అవార్డుల కోసం నామినేట్ అయిన చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ సినిమాగా ‘జవాన్’ నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ‘జవాన్’ వివిధ దేశాలకు చెందిన 10 చిత్రాలతో పోటీపడనుంది.
ఉత్తమ ఫీచర్ సినిమా విభాగంలో ఇండియా తరపున బరిలో నిలిచిన ‘జవాన్’…. అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ (ఫ్రాన్స్), కాంక్రీట్ యుటోపియా (దక్షిణ కొరియా), ఫాలెన్ లీవ్స్ (ఫిన్‌లాండ్), పర్ఫెక్ట్ డేస్ (జపాన్), రాడికల్ (మెక్సికో), ఆఫ్ ది స్నో (స్పెయిన్), ది టేస్ట్ ఆఫ్ థింగ్స్ (ఫ్రాన్స్), ది టీచర్స్ లాంజ్ (జర్మనీ) మరియు ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యునైటెడ్ కింగ్‌డమ్) సినిమాలతో పోటీ పడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న లాస్ ఏంజిల్స్‌లో ఈ ‘అస్త్ర’ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరగనుంది.
‘జవాన్’ చిత్ర యూనిట్ కు వెల్లువెత్తుతున్న అభినందనలు
ఈ ఏడాది భారత్ నుంచి ‘జవాన్’ ఈ ‘అస్త్ర’ అవార్డుల బరిలో నిలవడంతో సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘జవాన్’ కచ్చితంగా అవార్డును సొంతం చేసుకుంటుందంటూ షారుక్ అభిమానులు అడ్వాన్స్ గా అభినందనలు తెలుపుతున్నారు. గతేడాది ‘అస్త్ర’ అవార్డుల్లో ‘ఆర్ఆర్‌ఆర్’ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది.
Also Read : Rajinikanth: భర్త్ డే సర్ ప్రైజ్ ఇస్తానంటున్న తలైవా !