Shah Rukh Khan : ముంబై – అట్లీ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జవాన్ దుమ్ము రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. యాక్షన్ , థ్రిల్లర్ , రొమాంటిక్ మూవీగా తెరకెక్కించాడు దర్శకుడు.
Shah Rukh Khan Got Appreciations
ప్రధానంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఎక్కడ చూసినా జవాన్ గురించిన చర్చే జరుగుతోంది. ఈ ఏడాది బాద్ షా(Shah Rukh Khan) కు పండగే. ఎందుకంటే ఆయన నటించిన పఠాన్ బాలీవుడ్ లో బిగ్ హిట్ గా నిలిచింది.
ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ.1,000 కోట్లు కొల్లగొట్టింది. సరికొత్త రికార్డును నమోదు చేసింది. తాజాగా విడుదలైన జవాన్ చిత్రం కూడా రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదల కాకుండానే బ్రేక్ ఈవెన్ రావడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
జవాన్ చిత్రాన్ని షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించింది. భారీ బడ్జెట్ తో సినిమా తీశాడు అట్లీ. అతడి శ్రమ ఫలించింది. ఏకంగా ఈ ఒక్క సినిమాకు రూ. 220 కోట్లు ఖర్చు చేశాడు. ఇక రిలీజ్ కాక ముందు సినిమాకు రూ.350 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం ఇటు ఇండియాలో అటు ఓవర్సీస్ లో కలెక్షన్ల పంట కురుస్తోంది. దీంతో షారుక్ ఖాన్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Also Read : Nayanathara : నయన్ జవాన్ సెన్సేషన్