Dunki Movie : బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోలలో బాద్ షా షారుక్ ఖాన్ ఒకడు. తాజాగా అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ దుమ్ము రేపుతోంది. ఏకంగా రూ. 600 కోట్లు వసూలు చేసింది. ఇంకా మరిన్ని రికార్డులను కొల్లగొట్టేందుకు దూసుకు పోతోంది. ఇటు ఇండియాలో అటు ఓవర్సీస్ లో సత్తా చాటుతోంది. నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది.
Dunki Movie Updates
ఇదిలా ఉండగా ఈ ఏడాదిలో షారుక్ ఖాన్ కు ఇది రెండో సినిమా. మొదటి చిత్రం పఠాన్. లవ్లీ బ్యూటీ దీపికా పదుకొనేతో కలిసి నటించిన పఠాన్ ఏకంగా రూ. 1,000 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా దానిని బీట్ చేసేందుకు రెడీ అవుతోంది జవాన్. ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు షారుక్ ఖాన్. ఆయన సరసన అందాల తార నయనతార, దీపికా పదుకొనే నటించారు. విలన్ గా విజయ్ సేతుపతి విస్తు పోయేలా చేశాడు.
జవాన్ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న షారుక్ ఖాన్ మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అదే రాజ్ కుమార్ హిరానీ తీస్తున్న డుంకీ(Dunki Movie). ఈ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తుండగా దానిని ఇంకొంచెం పొడిగిస్తూ వచ్చే ఏడాది 2024లో రిలీజ్ చేయాలని బాద్ షా ఖాన్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఏది ఏమైనా ఇప్పటికే డుంకీ పోస్టర్ హల్ చల్ చేస్తోంది.
Also Read : Sai Pallavi : అమీర్ తనయుడితో సాయి పల్లవి