బాలీవుడ్ దిగ్గజ నటుడు షారుక్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. అట్లీ దర్శకత్వం దర్శకత్వం వహించిన జవాన్ చిత్రం ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. రూ. 700 కోట్లు దాటాయి కలెక్షన్స్. ఈ సందర్బంగా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. తన తదుపరి చిత్రం గురించి వెల్లడించారు.
రాజు హిర్వానీ దర్శకత్వంలో తాప్సీ పన్నుతో కలిసి షారుక్ ఖాన్ డుంకీ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం బాద్ షాకు ఈ ఏడాది రెండు సినిమాలు బిగ్ సక్సెస్ గా నిలిచాయి. దీంతో మూడో చిత్రం డుంకీ షూటింగ్ లో బిజీ అయ్యారు షారుక్ ఖాన్.
ఓ వైపు జవాన్ సక్సెస్ ఈవెంట్స్ లో పాల్గొంటూనే మరో వైపు షూటింగ్ లో పాల్గొంటున్నారు బాద్ షా. ఇదిలా ఉండగా పఠాన్, జవాన్ అనుకోని రీతిలో కోట్లు కుమ్మరించడంతో షారుక్ ఖాన్ నెక్ట్స్ మూవీ డుంకీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ మూవీలో నటిస్తున్న షారుక్ ఖాన్ ముందుగానే సినిమా రిలీజ్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఈ ఏడాది డిసెంబర్ 23న డుంకీని విడుదల చేస్తామని స్పష్టం చేశారు షారుక్ ఖాన్.
ఎందుకంటే ఈ ఏడాది ఆయనకు చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అందుకనే సెంటిమెంట్ కలిసి వస్తుందని బాద్ షా ఈ డేట్ డిక్లేర్ చేసినట్టు టాక్.