Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ కి క్షమాపణలు చెప్పిన ఆ సీనియర్ నటుడు

తాజాగా హీరోయిన్ తమన్నాకు కూడా క్షమాపణలు చెప్పారు...

Hello Telugu - Tamannaah Bhatia

Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తుంది. అటు వెబ్ సిరీస్, ఇటు మూవీస్ అంటూ తెగ బిజీగా ఉంటుంది. ఇటీవల అరుణ్మనై 4 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల తమన్నా డాన్స్ గురించి కోలీవుడ్ సీనియర్ నటుడు పార్తిబన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమన్నా(Tamannaah Bhatia) డ్యాన్స్ ఉంటే చాలు.. సినిమాలో కథ లేకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు మారాయని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంతో పార్తీబన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. పార్తీబన్ మాటలను కొందరు నెటిజన్స్ తప్పుబట్టారు. ఆయన ఏ సినిమాను ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేశారంటూ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన మాటలపై పార్తీబన్ రియాక్ట్ అయ్యారు.

Tamannaah Bhatia…

తాజాగా హీరోయిన్ తమన్నా(Tamannaah Bhatia)కు కూడా క్షమాపణలు చెప్పారు. చిత్రపరిశ్రమకు చెందిన వారందరిపైన తనకు గౌరవం ఉందని.. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. తన మాటలు ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. పార్తీబన్ తెలుగు, తమిళం చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో కనిపించారు. ఇక ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్ టిన్జ్ జూలై 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రెషన్లలో పాల్గొన్న పార్తీబన్ కొన్ని సినిమాలు, తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ ప్రస్తుత రోజుల్లో సినీ ప్రేక్షకులకు సినిమాలో కథ ఉందా ? లేదా? అనేది చూడడం లేదు.. హీరోయిన్ డాన్స్ కోసమే చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా సినిమా హిట్ అవుతుంది” అని అన్నారు. దీంతో పార్తీబన్.. జైలర్ లేదా బాక్ చిత్రాలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్స్ భావించారు. దీంతో ఆయన తీరుపై మండిపడ్డారు.

Also Read : Raj Tarun : రాజ్ తరుణ్ కు మాల్వి తో ఇల్లీగల్ రేలషన్ ఉందంటున్న లావణ్య

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com