బయో పిక్ లు, స్కామ్ లకు సంబంధించిన వెబ్ సీరీస్ లు ఇప్పుడు రాజ్యం ఏలుతున్నాయి. జనం వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ దేశంలో లెక్కలేనన్ని స్కామ్ లు చోటు చేసుకున్నాయి. వీటికి ఆధారాలు లేవు. ఉన్నా దేశం విడిచి పారి పోయిన వాళ్లున్నారు. ఇంకొన్ని కుంభకోణాలకు సంబంధించి పోలీస్ విచారణలో బయట పడినా రాజకీయాల కారణంగా అర్ధాంతరాంగానే ఆగి పోయాయి. ఇంకొన్నింటిలో శిక్ష పడేలా చేశాయి.
దాణా స్కాంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలు శిక్ష పడింది. అనారోగ్యం కారణంగా బయటకు వచ్చాడు. తన తనయుడే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆ రాష్ట్రానికి. ఇక స్కిల్ స్కాం కేసులో తాజాగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆపరేషన్ పేరుతో బయటకు వచ్చాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ , న్యాయ వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తూ ఉండడం వల్లనే ఇలాంటి వాళ్ల ఆటలు సాగుతున్నాయి. నేరస్తులు, మోసగాళ్లు, దగాకోరులు, రేపిస్టులకు పాలిటిక్స్ కేరాఫ్ గా మారడంలో వింతేముంది.
ఇక తాజాగా వెబ్ సీరీస్ విషయానికి వస్తే ఓటీటీలో తెల్గీ బిగ్ స్కామ్ కు సంబంధించి స్ట్రీమింగ్ అవుతోంది. అప్ డేట్ సీరిస్ లో ప్రముఖ నటుడు ముఖేష్ తివారీ , యాదవ్ కలిసి కనిపించ బోతున్నారు.