Satyam Rajesh: ‘టెనెంట్‌’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

‘టెనెంట్‌’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Hello Telugu - Satyam Rajesh

Satyam Rajesh: వై.యుగంధర్‌ దర్శకత్వంలో సత్యం రాజేశ్‌, మేఘా చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘టెనెంట్‌’. మహాతేజ క్రియేషన్స్‌ పతాకంపై మోగుళ్ళ చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీనితో తాజాగా ఈ సినిమా నుంచి ‘నా కథలో నువ్వున్నావా..నీ కథనే నేను అయ్యానా..నీ జతనై రమ్మంటావా ?’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Satyam Rajesh Movie Updates

ఈ పాటకు సంగీత దర్శకుడు సాహిత్యసాగర్‌ సాహిత్యం అందించగా… ఎన్‌జే సురేంద్రనాథ్, జయశ్రీ పల్లెం పాడారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ…‘ఈ సినిమాలోని భార్యాభర్తల అనురాగాన్ని, అప్యాయతను తెలియజేసే పాట ఇది. అందరికీ నచ్చుతుంది. జీవితం ఆడే వైకుంఠపాళిలో ఎంచుకున్న పాచికల్లాంటి ఆరు ముఖ్యపాత్రల మధ్య జరిగే కథే ఈ చిత్రం. కథ, కథనం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

Also Read : Kamal Hasan: వేసవిలో వస్తున్న ‘ఇండియన్‌ 2’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com