క్యారెక్టర్ అరిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పొలిమేర 2 చిత్రంలో నగ్నంగా నటించానని చెప్పాడు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పంచుకున్నాడు. కథ ప్రకారం ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
గతంలో కంటే ఇప్పుడు టాలెంట్ కలిగిన నటీ నటులకు మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపాడు. తను ఈ మధ్య హోటల్ కూడా స్టార్ట్ చేశాడు. సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర -2
ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా సత్యం రాజేష్ తన అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నాడు. ఈ చిత్రానికి డాక్టర్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
దీనిని గౌరీ కృష్ణ నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా అప్ డేట్ ఇచ్చిన సత్యం రాజేష్ ఉన్నట్టుండి బోల్డ్ కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. తన సినీ కెరీర్ లో ఇది మైల్ స్టోన్ గా మిగిలి పోతుందన్నాడు.