Sathyaraj: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్స్ కు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. క్రీడాకారులు మాత్రమే కాదు రాజకీయ నాయకుల బయోపిక్ లకు కూడా మంచి క్రేజ్ ఉంది. బాల్ థాకరే, జయలలిత, రాజీవ్ గాంధీ, గాంధీ, ఇలా చాలామంది బయోపిక్ లు ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రను తెరపైన ఆవిష్కరించడానికి కోలీవుడ్ నిర్మాతలు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ నటుడు, బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్(Sathyaraj)… ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్న నిర్మాతలు త్వరలో దర్శకుడి వివరాలను కూడా వెల్లడించనున్నట్లు సమాచారం.
Sathyaraj Movie Updates
1950, సెప్టెంబర్ 17న గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో దామోదర్ దాస్ మోదీ, హీరా బెన్ దంపతులకు 3 వ సంతానంగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ జన్మించారు. విద్యార్థి దశలోనే ఆర్. ఎస్.ఎస్ లో చేరి వాద్ నగర్ లో స్వయం సేవక్ గా శాఖలకు వెళ్ళేవారు . 1970లో అహ్మదాబాద్ చేరుకొని ఆర్.ఎస్.ఎస్ లో చేరి అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు. ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా ప్రారంభమైన ఆయన జీవితం కాల క్రమంలో అనేక మలుపులు తిరిగింది. చాయ్ వాలాగా 2001 లో గుజరాత్ బీజేపీ పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు. 2014లో చాయ్ వాలా బనేగా పీఎం అనే నినాదంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టారు. 2019లో రెండో సారి కూడా ప్రధాని మంత్రిగా ఎన్నికయ్యై… ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మూడో సారి ప్రధాని అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో మోదీ బయోపిక్ పై భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆశక్తి నెలకొంది. మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో రూపొందిన ఆ హిందీ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళ సీనియర్ నటుడు బాహుబలి ఫేమ్ కట్టప్ప సత్యరాజ్ తాజాగా ఈ బయోపిక్ లో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం అన్ని భారతీయ భాషల్లో తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మోదీ బయెపిక్‌లో సత్యరాజ్ నటిస్తే.. అతడికి ఇది రెండో బయెపిక్ అవుతుంది. ఇంతకుముందు సత్యరాజ్ భారతీయ సామాజిక కార్యకర్త , ‘ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ బయెపిక్‌లో నటించాడు. ఈ చిత్రంలో సత్యరాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Also Read : Suriya: పదివేల మందితో సూర్య ఫైట్ సీక్వెన్స్ !