Sathyam Sundaram: కార్తీ, అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’ టీజర్ రిలీజ్ !

కార్తీ, అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’ టీజర్ రిలీజ్ !

Hello Telugu - Sathyam Sundaram

Sathyam Sundaram: హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సత్యం సుందరం’. ‘96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. శుక్రవారం మేకర్స్ అధికారికంగా వదిలిన ఈ ‘సత్యం సుందరం(Sathyam Sundaram)’ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Sathyam Sundaram Movie Updates

ఈ టీజర్ విషయానికి వస్తే.. కార్తీ, అరవింద్ స్వామి రెండు వరల్డ్స్‌ని ప్రజెంట్ చేసింది. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని హైలైట్ అనేలా వుంది. వీరిద్దరు డిఫరెంట్ లైఫ్ స్టయిల్‌లో ఆకట్టుకున్నారు. కార్తీ అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే…. అరవింద్ స్వామి రిజర్వ్‌డ్ అర్బన్ పర్సనాలిటీ‌గా కనిపించారు. ముఖ్యంగా టీజర్ అంతా కార్తీ బావా బావా అంటూ పలుకుతూ… పల్లెటూరి వాతావరణానికి తీసుకెళుతున్నారు. ఈ టీజర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేదిగా ఉంది. గ్రేట్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేంద్రన్ జయరాజు కెమెరా పనితనం వావ్ అనేలా ఉంటే, గోవింద్ వసంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్‌ ని ఎలివేట్ చేసింది.

‘96’లో డ్రామాని డీల్ చేయడంలో తన సత్తా చాటిన సి ప్రేమ్ కుమార్.. ఇందులో లీడ్ రోల్స్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశారని తెలుస్తోంది. కార్తీ, అరవింద్ స్వామి డిఫరెంట్ రోల్స్‌లో మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఈ టీజర్ చేసింది. ఈ చిత్రానికి ఆర్‌ గోవింద్‌రాజ్‌ ఎడిటర్. ఈ సినిమా హ్యుమరస్ అండ్ హార్ట్ వార్మింగ్ మూవీ అని ఈ టీజర్ ప్రామిస్ చేస్తోంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Narudi Brathuku Natana: ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా నుండి ‘చెప్పలేని అల్లరేదో’ పాట రిలీజ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com