Sardar 2 : తమిళ సినీ చత్ర రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న నటుడు కార్తీ. తనకు నచ్చితేనే పాత్రలను ఎంపిక చేసుకుంటాడు. తన సోదరుడు సూర్య కూడా పాపులర్ . తమిళ ప్రేక్షకులు ఎక్కువగా తనను అభిమానిస్తారు. ఎలాంటి భేషజాలకు పోకుండా చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతాడు. అందుకే ప్రతి ఒక్కరికీ తను ఇష్టమైన నటుడిగా మారి పోయాడు. ఆ మధ్యన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ లో తళుక్కున మెరిశాడు.
Sardar 2 Movie Updates
ఇదే సమయంలో విలక్షణ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్ . ఇది బిగ్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ 2022లో వచ్చింది. మంచి ఆదరణ పొందింది కూడా. దీనికి సీక్వెల్ గా ప్రస్తుతం సర్దార్ -2(Sardar 2) పై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ మేకర్స్ తాజాగా టీజర్ ను విడుదల చేశారు. పిక్చరైజేషన్ సూపర్ గా ఉందంటూ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. తెలుగులో అంతగా వర్కవుట్ కాలేదు. కానీ ఇదే మూవీ తమిళనాడులో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న నీటి సమస్య గురించి ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు దర్శకుడు మిత్రన్. సర్దార్ మూవీలో కార్తీ(Karthi) డ్యూయల్ రోల్ పోషించాడు. రజీషా విజయన్ , రాశీ ఖన్నా హీరోయిన్లు కాగా బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్ పాత్రలో , లైలా మరో కీలక రోల్ లో నటిస్తుండడం విశేషం. ఇందులో ప్రతి నాయకుడి పాత్ర మరింత ఆసక్తిని రేపుతోంది. టీజర్ ను ఆసక్తి రేపేలా తీశాడు దర్శకుడు. మే 30న విడుదల చేస్తామని ప్రకటించారు.
Also Read : Beauty Sree Leela : జోరు పెంచినా శ్రీలీలకు నిరాశేనా