Sarangapani Jathakam : ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒరిగి పోయే నటుడు ప్రియదర్శి. తను నటించిన జాతి రత్నాలు, మల్లేశం, ఇటీవల వచ్చిన కోర్ట్ దేనికదే. తాజాగా తను కీ రోల్ పోషించిన మూవీ సారంగపాణి జాతకం. ఇప్పటికే అంచనాలు పెంచేస్తోంది. దీనిని తీసింది ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన కథలు భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని, ఆలోచింప చేసేలా ఉంటాయి. టేకింగ్, మేకింగ్ లో తను ప్రత్యేకం. అందుకే ఈ ఫీల్ గుడ్ , వినోదాత్మక చిత్రం మరింత ఆసక్తిని రేపుతోంది.
Sarangapani Jathakam Movie Updates
తాజాగా సారంగపాణి జాతకం(Sarangapani Jathakam) చిత్రం గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ మూవీని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మొత్తంగా ఇంటిల్లిపాదిని నవ్వించేందుకు రెడీ అయ్యారు. విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నవ్వించేందుకు సిద్దమైంది. ఇందులో యువతను ఆకర్షించే కామెడీతో పాటు కాస్తంత క్రైమ్ కూడా దాగి ఉంది. సమ్మర్ కూల్ స్పెషల్ గా రానుందని స్వయంగా వెల్లడించారు దర్శకుడు మోహనకృష్ణ.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పూర్తి వినోదాన్ని అందించాలనే నా కోరిక ఈ సినిమాతో నెరవేరిందన్నారు. మొదటి కాపీతో సహా సినిమా సిద్ధంగా ఉందని చెప్పారు.. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. మీకు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వడానికి మా ‘సారంగ పాణి జాతకం వస్తోందన్నారు. వాస్తవానికి తాము 18న విడుదల చేయాలని అనుకున్నామని, కానీ కొనుగోలుదారుల సూచన మేరకు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు.
ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అసరాల, ‘వెన్నెల’ కిషోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, వెంకట్, రూప కె. మణి కూడా కీలక పాత్రలు పోషించారు.
Also Read : Popular Music Director-Ilayaraja :ఇళయరాజా మ్యాజిక్ సాంగ్ మెస్మరైజ్